27 July, 2026 | 1:47 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

27-07-2026 12:54 AM

కూకట్‌పల్లి, జూలై 26 (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూసాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీ పై మూసాపేట  నుండి జగద్గిరిగుట్టవైపు వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు టిప్పర్ లారీ కిందపడి ఇద్దరు యువకులు అక్కడక్కడికే మృతి చెందగా ఓ యువకుడు తీవ్ర గాయాల పాలయిన సంఘటన శనివారం రాత్రి జరిగింది.

జూబ్లీహిల్స్ యూసుఫ్ గూడా శంకర్ నగర్ కు చెందిన ముగ్గురు స్నేహితులు మహేష్ (17), లక్ష్మీ తేజ(17), కిరణ్ కుమార్(17) లు అమీర్పేట్ లోని అమృత కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. సెలవు రోజులలో క్రికెట్ ఆడటానికి వెళ్తుంటారు.

శనివారం రాత్రి శంకర్ నగర్ నుండి జగద్గిరిగుట్ట వైపు ఏ పి 09 సి డబ్యూ 7809 మాస్ట్రో  బైక్ పై ముగ్గురు స్నేహితులు బాక్స్ క్రికెట్ ఆడడానికి వెళ్తుండగా కూకట్పల్లి మెట్రో స్టేషన్ కు సమీపంలో రోడ్డుపై గుంతలు ఉండడంతో గుంతల్లోపడ్డ స్కూటీ అదుపుతప్పి పక్కనే వెళుతున్న టిప్పర్ నెంబర్ టిఎస్ 22టి 3558 కింద పడింది. టిప్పర్ టైర్ కింద పడిన మహేష్, లక్ష్మీతేజ లు అక్కడికక్కడే మృతి చెందగా కిరణ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన చికిత్స నిమిత్త  సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని టిప్పర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.