20-02-2026 12:57:54 AM
5వ బ్రాంచ్‌ని ప్రారంభించిన సినీ నటులు
హైదరాబాద్, ఫిబ్రవరి 19(విజయకాం తి) : టీఎక్స్ హాస్పిటల్స్ మియాపూర్‌లో తన 5వ బ్రాంచ్‌ని ఘనంగా ప్రారంభించి మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. నైతికత, నాణ్యత, ఆధునిక వైద్య సేవలను ప్రజ లకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ విస్తరణ చేపట్టబడింది. గురువారం ఉదయం సంప్రదాయ హోమం, పూజలతో ప్రారంభమై, అనంతరం ప్రముఖ నటుడు బాబుమో హన్, ప్రముఖ నటి సంయుక్త మీనన్, మరో నటుడు అఖిల్‌ఉద్దేమరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి టీఎక్స్ హాస్పిటల్ బ్రాంచిని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి వైద్యులు, ఆహ్వానిత అతిథులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మియాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ మల్టీ-స్పెషాలిటీ సెంటర్ ఆధునిక వసతులు, అధునాతన నిర్ధారణ పరికరాలు, సిస్టమేటిక్ క్లినికల్ ప్రొటోకాల్స్‌తో రూపుదిద్దుకుంది. ముఖ్య స్పెషాలి టీల్లో ఈ కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ శస్త్రచికిత్స సేవలు అం దుబాటులోకి తీసుకురావాలని యాజమా న్యం వెల్లడించింది.
ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కీర్తికర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి, సీఓఓ డాక్టర్ శ్రీకాంత్ వొడ్నాల సంస్థ నాణ్యత ఆధారిత, పేషెంట్- సెంట్రిక్ వైద్య సేవల పట్ల తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు పాండురంగ రెడ్డి, నవ్య వాణి, డాక్టర్ రవి కిరణ్, జనార్ధన్ ఈ కొత్త బ్రాంచ్ మియాపూర్, పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలను మరింత చేరువ చేస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో టీఎక్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్లు, స్థానిక మీడియా ప్రతినిధులు, డిజిటల్ ఇన్‌ఫుయెన్సర్లు పాల్గొన్నారు.హైదరాబాద్‌లో ఐదు బ్రాంచిలతో టీఎక్స్ హాస్పి టల్స్ విశ్వసనీయత, నైపుణ్యం, సేవాభావంతో వైద్య రంగంలో ముందంజలో కొన సాగుతోంది.