19 March, 2026 | 8:52 AM

డిగ్రీ కళాశాలలో ఉగాది వేడుకలు

19-03-2026 12:00 AM

కాగజ్‌నగర్, మార్చి 187(విజయ క్రాంతి) : కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం కళాశాల తెలుగు,  హిందీ విభాగాల నేతృత్వంలో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి మాట్లా డుతూ మన సంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణలో ఇలాంటి వేడుకలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. 

అనంతరం కళాశాలలో ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థు లు అధ్యాపకులకు పంపిణి చేశారు. అనంతరం వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళా శాల వైస్ ప్రిన్సిపాల్ డా.డి.లక్ష్మినరసింహం, కళాశాల అకడమిక్ కో ఆర్డినేటర్ డి.జనార్థన్,ఐ.క్యు.ఎ.సి కో ఆర్డినేటర్ డా.ఇ.శారద అధ్యాపకులు ఎం.రాజేశ్వర్, టి.దత్తాత్రేయ, డా.వి.దేవెందర్  జె.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.