19 March, 2026 | 10:15 AM

జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం

19-03-2026 12:00 AM

జొన్న పంటలకు భారీ నష్టం 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18 (విజయ క్రాంతి): జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. పలుచోట్ల కోత దశలో ఉన్న పంటలు నేలకొరిగి రైతుల ఆశలు నీరుగారాయి. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ శివారులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.స్థానిక రైతు బాబురావుతో పాటు మరో రైతు కలిసి మొత్తం 4 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు.

పంట కోత దశకు చేరుకున్న సమయంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం వా రి ఆశలను ఛిద్రము చేసింది. వర్షం తీవ్రతకు జొన్న పంట పూర్తిగా నేలకొరిగి భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో అప్పుల బారిన పడ్డ రైతులకు ఈ నష్టం మరింత భారంగా మారింద ని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.