calender_icon.png 9 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భవనం నిర్మించాలి

08-01-2026 01:36:28 AM

ఏబీవీపీ నాయకులు 

రామాయంపేట, జనవరి 7: మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్న సొంత భవనం లేకపోవడం దురదృష్టకరమని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ అన్నారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ను కలిసి కళాశాల సమస్యలు వివరించి, వినతి పత్రం అందజేశారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తరగతి గదులు లేకపోవడం విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు.

ఒక సబ్జెక్టు బోధించేటప్పుడు, మరో ఇయర్ విద్యార్థులు బయట కూర్చోవలసి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. 150 మంది విద్యార్థులు ఉంటే 50 మంది బాలికలే ఉన్నారని తక్షణమే స్పందించి కళాశాలకు సొంత భవనం నిర్మించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు ఆయనతో పాటు ఏబీవీపీ నాయకులు అర్జున్ సతీష్ దినేష్ సన్నీ సాయి తదితరులు ఉన్నారు.