calender_icon.png 27 October, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్‌ఎస్ విషప్రచారం చేస్తుంది

27-10-2025 12:59:49 AM

--కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పాయం రామనర్సయ్య గత పదేళ్ళలో బీఆరెస్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

--కాంగ్రేస్ కొప్రచారకమిటి అధ్యక్షులు వాసం శ్రీకాంత్

ఆళ్ళపల్లి ,అక్టోబర్ 26,(విజయక్రాంతి)కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక గ్రామాలొ సంచరిస్తు మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు విషప్రచారాలు చేస్తున్నారని కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షులు పాయం రామనర్సయ్య, కో ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ ప్రకటన లో తెలిపారు.మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రామాల్లో పర్యటిస్తూ అమాయక గిరిజనులను మ రోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

గతంలో బీఆరెస్ పార్టీలో ఉన్నవారినే మరలా పార్టీలో చేరికున్నట్లు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో శాసనసభ్యులు పాయం ప్రజాదరణ పెరగడంతో మాజి ఎమ్మెల్యే రేగా కాంతావు ఉనికిని చాటుకోవడం కోసం గ్రామాల్లో సంచరిస్తూ కాంగ్రేస్ పై విషప్రచారం చేస్తున్నారన్నారని, అధికారంలో వున్నప్పుడు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి.

అధికారం కోల్పోయాక కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెట్టే ప్ర యత్నం చెస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఎన్ని మాయమాటలు చెప్పిన నమ్మరని తెలుసుకోవాలన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ నీడను కూడా తాకలేరన్నారు. శాసన స భ్యులు పాయం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అసత్య ప్రచారాలతో జనం మెప్పు పొందేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారని.

గత పదేళ్ళలో బీఆరెస్ ప్రజలకు చేసిందేమిలేదని, అందుకే ప్రజలు కాంగ్రేస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రాబోయే ఎన్నికలలో మరో సారి బీ ఆరెస్ ఓడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రేస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు జనాదరణ పొందాయి ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా కాంగ్రేస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు..స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రేస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.