calender_icon.png 27 October, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా.. నిరుద్యోగుల హర్షం

27-10-2025 01:01:03 AM

ఇల్లెందు, అక్టోబర్ 26, (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగు ణంగా సింగరేణి సంస్థ తన సామాజిక బా ధ్యత కార్యక్రమాల్లో భాగంగా మెగా జాబ్ మేళాల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సింగరేణి సౌజన్యంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. అక్కడికి ఇల్లందు ఏరియా జి.యం వి.కృష్ణ య్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జి.యం మాట్లాడుతూ జాబ్ మేళాకు వచ్చేవారు పేరు నమోదు చేసుకోవడం కోసం ఒక క్యూఆర్ కోడ్ ను కూడా రూపొందించి పోస్టర్లలో, వాట్సాప్ గ్రూపుల్లో పొందుపరుస్తు న్నారని ఇది నిరుద్యోగులకు ఎంతో సౌకర్యం గా ఉందన్నారు. ఇప్పటికే వేలాది మంది ని రుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, కాగా హైదరాబాద్ లోని పలు ప్రైవే టు కంపెనీల వారిని సంప్రదించి వారికి కావలసిన మానవ వనరుల వివరాలను తెలుసుకొని ఈ జాబ్ మేళాకు రావలసిందిగా ఆహ్వానిచగా, సుమారు 200 కంపె నీలను సంప్రదించి జాబ్ మేళాలో వారి స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఇంటర్వ్యూలు జరుపుకునేందుకు సౌకర్యాలను కల్పిస్తున్నారు.

ఏడో తరగతి మొదలు డిగ్రీ పోస్ట్ గ్రా డ్యుయేషన్ వరకు అలాగే డిప్లమా, ఇంజనీరింగ్ వంటి విద్యను అభ్యసించిన వారికి కూడా తగిన ఉద్యోగం కల్పించడానికి ఈ జా బ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నారు. ఈ కం పెనీల వారు తమ తమ కంపెనీలో గల ఉద్యోగ అవకాశాలను ప్రాంగణంలో ప్రకటిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు తగిన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు స్టాల్స్ కి వెళ్లి దరఖాస్తు చేసుకొని అప్పటికప్పుడు నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగ నియామక పత్రా లు కూడా అందుకుంటున్నారు. ఈ కార్యకమానికి 21 వేల మంది నిరుద్యోగులు పాల్గొ న్నారు వారిలో 4 వేల 500 మందికి ఉద్యో గ నియామక పత్రాలు అందుకోవడం పట్ల నిరుద్యోగులు తమ సంతోషం ప్రకటిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సూచనతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మరియు ఇతర శాఖల నిర్వహణలో సింగరేణి సౌజన్యంతో తమ గ్రా మాల వద్దనే జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించటం తమకు ఎంతో సౌకర్యంగా ఉంద ని, పైసా ఖర్చు లేకుండా ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతున్నామని నిరుద్యోగు లు తమ ఆనందం ప్రకటిస్తున్నారు. జాబ్ మేళాకు హాజరుతున్న వారికి అనేక సౌకర్యాలను సింగరేణి సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నారు. మంచినీటితో పాటు వారికి లం చ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మం త్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ జాబ్ మేళా కార్యక్రమాల నిర్వహణలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు.

సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా జాబ్ మేళా కార్యక్రమాలకు సహకారం అందించాలని ఆయన సూచించారు. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువత కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మరిన్ని జా బ్ మేళా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, నిరుద్యోగులకు వారి విద్యార్హతలకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యే యంగా సహకరిస్తున్నామని సింగరేణి ఛైర్మ న్ మరియు ఎండీ శ్రీ ఎన్. బలరామ్ తెలియజేశారు. సింగరేణి ప్రాంతంలో దాదాపు అన్ని ఏరియాలలో కూడా ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తామని ఆయన తెలియజే శారు. మొత్తం మీద ఈ జాబ్ మేళా కార్యక్రమాల నిర్వహణ తెలంగాణ ప్రాంత నిరు ద్యోగ యువతకు ఒక వరంగా మారిందని చెప్పవచ్చు. 

ఈ కార్యక్రమంలోయస్. ఓ. టూ జి. యం. రామస్వామి, డీజియం పర్సనల్ అజీర తుకారాం, డీజియం(సివిల్) రవికుమార్, డీజియం (యఫ్ & ఏ) మధు బాబు, సర్వే అధికారి రామమూర్తి, సెక్యూరి టీ అధికారి అంజి రెడ్డి, మేనేజర్ ఐ.టి ఆర్ సుదాకర్, పి.ఆర్.ఓ. శ్రీకాంత్, సీనియర్ ప ర్సనల్ అధికారి వి.అజయ్, ఇతర అధికారులు ఉద్యోగులు, పాల్గొన్నారు.