calender_icon.png 31 October, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయంగా ఎదుర్కోలేక నాపై దుష్ప్రచారం

31-10-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి

చౌటుప్పల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం లోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా రాజ్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్న అని కావాలని బిఆర్‌ఎస్ వాళ్ళు ,మా పార్టీ వాళ్లు కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.

నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్ర చారాలను నమ్మొద్దని రాజకీయంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను నేను క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టాన ఏ నిర్ణయం తీసు కున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. నా ముందు మునుగోడు అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదన్నారు.  అలాగే చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతుంది. చౌటుప్పల్ చెరువు నుండి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద నీరును డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పింది.