calender_icon.png 31 October, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టరేట్ పట్టా పొందిన ఐఐఎంసీ కళాశాల ఆంగ్లోపన్యాసకురాలు

31-10-2025 12:00:00 AM

రాజ్యలక్ష్మీ కళ్యాణికు డాక్టరేట్

అభినందించిన ఐఐఎంసీ కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది

ఖైరతాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి): ఐఐఎంసీ డిగ్రీ మరియు పీజీ కళాశాల(స్వయం ప్రతిపత్తి) ఆంగ్లోపన్యాసకురాలు, పరీక్షల నియంత్రణ అధికారి సీహెచ్ రాజ్యలక్ష్మీ కళ్యాణి డాక్టరేట్ పొందారు. ఆమె అనురాగ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా అధ్యయన కోర్సును చదివి ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ జీవీఎస్ అనంతలక్ష్మి పర్యవేక్షణ లో ‘తెలంగాణ ప్రాంతంలో డిగ్రీ స్థాయిలో ఈఎల్‌టీ కరిక్యులంఆఫ్ మేనేజ్‌మెంట్‌లో స్టడీస్లో డిజైన్ థింకింగ్ అప్రోచ్ బోధనాపరమైన సమస్యలు ‘ఒక విమర్శనాత్మక అధ్య యనం’ అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని సమర్పించి పరీక్షకుల ప్యానల్ సిఫార్సుల మన్ననలు పొందారు.

ఈ నేపథ్యంలో ఆరట్స్ అండ్ హ్యుమానిటీస్ ఫ్యాకల్టీలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) అవార్డుకు రాజ్యలక్ష్మీ కళ్యాణ అర్హత పొందినట్లు అనురాగ్ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం డీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మీ కళ్యాణికి కళాశాల యజ మాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు అభినందనలు తెలిపారు.