22 August, 2026 | 4:04 PM

ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

22-08-2026 03:26 PM

కోనరావుపేట, ఆగస్టు 22 (విజయక్రాంతి ): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కోనరావుపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఇన్‌చార్జి ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవి మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్ట రవి మాదిగ మాట్లాడుతూ.. మత దురహంకారం, కుల వివక్ష, సాంఘిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం ఎమ్మార్పీఎస్ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్మించాలని, మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకువచ్చి శక్తివంతమైన సైన్యంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా అక్కెనపల్లి సురేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా మెర్గు వెంకటేష్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా ముత్యం రాజు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి రవి మాదిగ, కార్యదర్శిగా తాండ్ర ప్రతాప్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అవునూరి ప్రభాకర్ మాదిగ, ఖానాపూర్ లక్ష్మణ్ మాదిగ, ఆవునూరి లచ్చన్న మాదిగ, శోభ రాణి మాదిగ, తర్రె శంకర మాదిగ, గజ్జల అశోక్ మాదిగ, ఎగ్లాస్‌పూర్ సర్పంచ్ పసుల పోచయ్య మాదిగతో పాటు వివిధ గ్రామాల అధ్యక్షులు, కుల సంఘాల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.