1 July, 2026 | 9:25 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అబ్దుల్ నాగారంలో ఉచిత మెగా వైద్య శిబిరం..

24-06-2025 06:24 PM

తరిగొప్పుల (విజయక్రాంతి): మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Mallareddy Narayana Super Speciality Hospital) హైదరాబాద్ వారు మంగళవారం మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో అర్జుల సంపత్ రెడ్డి అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో ప్రత్యేకమైన ఏడు రకాల వైద్య సేవలు ఏర్పాటు చేసి అందులో సాధారణ చికిత్స, పిల్లలకు సంబంధించిన చికిత్స, చర్మ వ్యాధులు, సుఖ వ్యాధులు, మానసిక వ్యాధులు, ఛాతి వ్యాధులు, ఎముకలకు, కీళ్లకు, గర్భిణీ స్త్రీల గురించి, కంటి వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, వ్యాధుల గురించి చికిత్సలు అందించి అవసరం ఉన్నవారికి ఆపరేషన్ కోసం గ్రామం నుండి ప్రత్యేకంగా ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఆపరేషన్ చికిత్సలు చేసిన అనంతరం తిరిగి ఇంటికి పంపించడం జరుగుతుందని క్యాంప్ ఇన్చార్జిలు వినేష్, వెంకట్, ఓబుల్ రెడ్డిలు తెలిపారు.