16-06-2025 08:59:27 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ హంటర్ రోడ్ లోని అనుమతి లేని నారాయణ పాఠశాల(Narayana Schools)ను సోమవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. నారాయణ పాఠశాలలో అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్స్, తరగతులను నిర్వహిస్తున్నారని, పాఠశాలకు ఎలాంటి పర్మిషన్ లేవని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పాఠశాలను ఎంఈవో సీజ్ చేశారు.