04-08-2025 12:39:49 AM
బాన్సువాడ, ఆగస్టు 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఆదివారం మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ, జిల్లా కార్యదర్శి పయ్యల శంకర్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు మండల కన్వీనర్ దర్జీ మహేష్, బూత్ అధ్యక్షులు మహేందర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.