22 April, 2026 | 1:35 AM

ఫైనాన్షియల్ అకౌంటింగ్‌పై అవగాహన

22-04-2026 12:05 AM

జాహ్నవి డిగ్రీ, పీజీ కళాశాల, నారాయణగూడలో నిర్వహణ  

హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): జాహ్నవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నారాయణగూడలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మౌలిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కె.కృష్ణ చైతన్య(ఉస్మానియా యూనివర్సిటీ) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాథమిక సూత్రాలు, లావాదేవీల నమోదు విధానం, ఆర్థిక నివేదికల ప్రాముఖ్యత గురించి సవివరంగా వివరించారు.

ప్రాక్టికల్ దృష్టితో అకౌంటింగ్ నేర్చుకోవడం విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ ఎ. పరమేశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, నేటి పోటీ ప్రపంచంలో నైపుణ్యాల అభివృద్ధి అత్యంత ముఖ్యమని, ఇలాంటి గెస్ట్ లెక్చర్స్ విద్యార్థులకు విలువైన జ్ఞానాన్ని అందిస్తాయని అన్నారు.

ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులను ఉత్సాహపరుస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని, అతిథి ఉపన్యాసం ద్వారా కొత్త విషయాలు తెలుసుకొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో అకౌంటింగ్‌పై ఆసక్తిని పెంపొందించి, వారి విద్యా ప్రయాణానికి మరింత బలాన్ని చేకూర్చింది.