15 March, 2026 | 3:11 PM

‘దీపావళి’కి యునెస్కో గుర్తింపు

11-12-2025 12:18 AM

అరుదైన జాబితాలో చోటు

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగకు ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో తన ’మా నవ సంస్కృతికి చెందిన వారసత్వ జాబితా’లో దీపావళిని చేర్చినట్లు బుధవారం ప్రకటించింది. దీంతో అంతర్జాతీయం గా అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యు నెస్కో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ’ఎక్స్’లో స్పందిస్తూ.. ‘భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ వార్తతో పుల కించి పోతున్నారు. దీపావళి మన సంస్కృతి, విలువలతో పెనవేసుకుపోయింది. ఇది మన నాగరికతకు ఆత్మ లాంటిది. ఈ గుర్తింపుతో దీపావళి ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా మ రింత పెరుగుతుంది. శ్రీరాముడి ఆదర్శాలు మనందరినీ ఎల్లప్పుడూ నడిపించాలి’ అని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా స్పందిస్తూ, ఇది భారత్‌కు చారిత్రక దినమని అభివర్ణించారు.

ప్రధాని మోదీ హయాంలో భారత సాంస్కృతిక వారసత్వానికి అపూర్వమైన అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు.మొట్టమొదటిసారిగా భారత్ ఆతిథ్యమిస్తున్న యునెస్కో 20వ అంతర్ ప్రభుత్వ కమిటీ సమావేశాలు ఈ నెల 8 నుంచి 13 వరకు ఢిల్లీని ఎర్రకోటలో జరుగుతున్నాయి.

యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్‌తో జరగడం ఇదే ప్రధమం. ఈ సమా వేశాల్లోనే దాదాపు 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను పరిశీలించి, దీపావళికి ఈ గుర్తింపునిస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో కుంభమేళా, దుర్గాపూజ, గుజరాత్ గర్భా, యోగా సహా 15 భారతీయ అంశాలు ఉండగా, తాజాగా దీపావళి చేరికతో ఈ సంఖ్య 16కి పెరిగింది.