calender_icon.png 13 December, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

85వేల వీసాల రద్దు

11-12-2025 12:20:32 AM

  1. వీటిలో విద్యార్థి వీసాలు 8 వేల పైనే యూఎస్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం

ప్రకటించిన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్

ఆఫ్గన్లకు వీసాల నిలిపివేత..

ధ్రువీకరించిన అమెరికా విదేశాంగ శాఖ

వాషింగ్టన్, డిసెంబర్10: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన తాజా ఇమ్మిగ్రేషన్ అమలు ఒత్తిడి కింద అధికారులు నిరంతర తనిఖీని నిర్వహిస్తుండడం, జాతీయ-భద్రతా సమీక్షలను కఠినతరం చేయడం, క్రిమినల్ నేరాలను లక్ష్యంగా చేసుకోవడంతో వీసా రద్దు లు పెరిగాయని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. జనవరి నుంచి 85వేల వీసాలు రద్దు చేశామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్టు చేసింది. అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొం ది.

ఈ వీసాల రద్దు కారణంగా 8వేల మందికి పైగా విద్యార్థులపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వలసేతర వీసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వలసేతర వీసాలను రద్దు చేసినట్లు తెలిసింది.

హింస, చోరీల కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పా ల్పడిన వారే ఇందులో అధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం అక్రమ వలసదారులను వెనక్కి పంపించే కార్యక్రమం చేపట్టారు. దీంతోపాటు సోషల్‌మీడియా వెట్టింగ్(వీసా జారీకి ముందు అభ్య ర్థి సోషల్‌మీడియా ఖాతాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం)తోపాటు స్క్రీనింగ్‌ను విస్తృతం చేశా రు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీ సాల రద్దును ముమ్మరం చేశారు.

కొన్ని నెల ల క్రితం హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేసుకు నే వారి లింక్డిన్ పేజీలు, రెజ్యూమోలను సమీక్షించాలని ఇటీవల తనదౌత్యవేత్తలకు అమె రికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో వీసా అపాయింట్‌మెంట్లు పోస్టు పోన్ అయ్యాయి.

గత వా రంలో, పరిపాలన అనేక ఇతర ఇమ్మిగ్రేషన్ మార్గాలను అమెరికా కఠినతరం చేసింది. ఎస్‌ఎస్‌సీఐఎస్ ఆందోళన చెందుతున్న దేశాల ప్ర జల నుంచి గ్రీన్ కార్డ్ దరఖాస్తులను పునఃపరిశీలిస్తామని తెలిపింది. ఆ ఏజెన్సీ అన్ని ఆశ్ర య నిర్ణయాలనూ జారీచేసింది. అమెరికా ద ళాలకు సహాయం చేసిన ఆఫ్ఘన్లకు వీసాలను ని లిపివేస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

హెచ్1బీ అయ్యోమయం

అమెరికా కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారతీయ హెచ్1బీ దరఖాస్తుదారుల్లో అయ్యోమయం నెలకొంది. ఈ పాలసీ వల్ల భారీ సంఖ్యలో వీసా అసాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్‌అయిందని ఈ మెయిల్ అందినవారికి.. కొత్త అపాయింట్‌మెంట్ డేట్ విషయంలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

అలాగే రీ షెడ్యూలింగ్ గురించి తెలియజేసిన తర్వాత కూడా గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీకి కాన్సులేట్‌కు రావొద్దని పేర్కొంది. మళ్లీ కొత్త తేదీలపై స్పష్టత లేనప్పటికీ. డిసెంబర్‌లో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చిలో చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఓ ఇంటర్నేషనల్ మీడియాలో ఓ కథనం తెలిపింది. అమెరికా వీసా రద్దును స్టేట్ డిపార్ట్‌మెంట్ గణనీయంగా పెంచిన నేపథ్యంలో ఈ వాయిదా ప్రకటన వచ్చింది.