21 May, 2026 | 5:08 AM

కోస్గి ఇంజినీరింగ్‌లో నిండని సీట్లు

11-08-2025 01:53 AM
  1. ప్రైవేటు వర్సిటీలో డిమాండ్
  2. రాష్ట్రవ్యాప్తంగా 87.3శాతం భర్తీ
  3. ముగిసిన ఎప్‌సెట్ చివరి విడత కౌన్సెలింగ్

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రి య ముగిసింది. ఈ మేరకు ఎప్‌సెట్ చివరి రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయినట్లు సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాల్లో 87.3 శాతం సీట్లు నిండినట్లు తెలిపారు. కోస్గిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో మొత్తం 198 సీట్లకు 56 సీట్లు మాత్రమే నిండినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంకా 142 సీట్లు (71. 80శాతం) ఖాళీగా ఉన్నాయి.

రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రం 1,386 సీట్లకు 1,379 సీట్లు భర్తీ (99.4 శాతం) అయ్యాయి. 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 91,649 సీట్లకు 80,011 సీట్లు (87.3శాతం) భర్తీ అయ్యాయి. మరోవైపు జేఎన్‌టీయూలోని 21 ఇంజనీరింగ్ కళాశాలల్లో 6,462 సీట్లకు 4,669 ( 72.2 శాతం) సీట్లు నిండాయి.

1,793 సీట్లు ఖాళీ గా ఉండిపోయాయి. చివరి దశ కౌన్సెలింగ్ కోసం 97,369 అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా.. 40,837 మంది మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు. 16,86,699 ఆప్షన్లు ఇవ్వగా... 91,649 సీట్లకు 80,011 సీట్లు అలాట్ అయ్యాయి. ఇందులో కొత్తగా సీట్లు పొందిన అభ్యర్థులు 4,720 మంది ఉన్నారు.

ఇక 20,028 మంది అభ్యర్థులు స్లుడింగ్ ఆప్షన్ ద్వారా తమ సీట్లను మార్చుకు న్నారు. మొత్తంగా రాష్ట్రంలో 11,638 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. సీట్లు పొందిన విద్యార్థులు ట్యూ షన్ ఫీజును ఈ నెల 12వ తేదీ లోగా చెల్లిం చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కమిషనర్ తెలిపారు. 

కంప్యూటర్ అనుబంధ సీట్లు హాట్ కేకులే

ఎప్పటిలాగే ఎప్‌సెట్ చివరి రౌండ్‌లోనూ కంప్యూటర్ అనుబంధ బ్రాంచి సీట్లు హాట్ కేకుల్లా మారాయి. విద్యార్థులు సీఎస్‌ఈ దా ని అనుబంధ బ్రాంచ్‌లైన ఏఐ, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఏఐఅండ్‌ఎంఎల్, రొబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, సీఎస్‌డబ్ల్యూ, సీఎంఈ, సీఎస్‌బీ, సీఐసీ వంటి కోర్సులను ఎంచుకునేందుకే ఆసక్తి చూపించారు. మొత్తంగా సీఎస్‌ఈ, అనుబంధ బ్రాంచ్ సీట్లను 91.92 శాతం విద్యార్థులు ఎంచుకున్నారు. ఈసీ, ఈఈఈ వాటి అనుబంధ బ్రాంచ్‌లను 79.52శాతం, సివిల్, మెకానికల్, అల్లుడ్ బ్రాంచులను 68.22శాతం, ఇతర ఇంజినీరింగ్ బ్రాంచ్‌లను 73.51శాతం ఎంచుకున్నారు.