calender_icon.png 14 August, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు

11-08-2025 01:53:17 AM

  1. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

అవసరమైన ప్రతి చోట కొత్త రోడ్లు..

మంత్రి పొన్నం ప్రభాకర్..

రోడ్డును పునర్నిర్మించాలని  ఎన్నో మార్లు ఫిర్యాదు చేశాం. 

ఎమ్మెల్యే ముఠా గోపాల్.. 

రాంనగర్ లో 1.60 కోట్ల వ్యయంతో విడిసిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం..

హాజరైన ఎంపీలు డాక్టర్ కే. లక్ష్మణ్, ఎం. అనిల్‌కుమార్

ముషీరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాం తి) ముషీరాబాద్ నియోజకవర్గం సాగర్లాల్ ఆసుపత్రి చౌరస్తా నుంచి దాయారం మార్కె ట్ వరకు రూ. 1. 60 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు నేతల పరస్పర నినాదాలు, తోపులాటతో గందరగోళంగా మా రింది. మంత్రుల అసహనం, ఆగ్రహం వ్య క్తం చేశారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రా రంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నగర ఇన్చార్జ్ రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎంపీలు ఎం. ఆనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ కె. లక్ష్మణ్, కార్పొరేటర్ కె.  రవిచారిలు హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుసుకున్న వీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ప్రారంభోత్సవ స్థలానికి ప్రజా ప్రతినిధులు చేరుకునే సమయంలో ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రారంబోత్సవ వేదిక వద్ద గందరగోళంగా మారింది. వేదిక వద్ద ముందుకు దూసుకువ స్తున్న నేతలను వెనక్కు వెళ్లాలని ఎంపీ. అనిల్ కుమార్ యాదవ్ వేదిక వద్దనుంచి వచ్చి వారిని పక్కకు జరుపుతున్నప్పటికి వెనక్కు ఎవరూ వెళ్లలేదు.

అప్పటికే మూడు పార్టీల నేతలు భారత్ మాతాకి జై,  సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ జిందాబాద్, బీఆర్‌ఎస్ జిందాబాద్ అంటూ ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో   ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, సీఐ రాంబాబు, ఎస్టులు నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటి కి ఏ ఒక్కరూ వినిపించుకోకుండా వేధిక వద్ద కు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.

ఓ సందర్భంలో పోలీసులు వారిని వెనక్కు నెట్టేసారు. దీనితో కొంత మంది  నేతలు పోలీసులతో వాగ్వివాదానికి సైతం దిగారు. ఈ పరిణామాలను గమనించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి , రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్ లు కార్యకర్తలపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తున్న వారిని వారించారు. వారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన వెంటనే వేదిక వద్దనుంచి హడావిడిగా వెళ్లిపోయారు.

నగర ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్ నగరం చాలా పెద్దదని అభివృద్ధి పనులకు నిధుల లేమి వల్ల అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి  అన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిధుల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల స్థానికంగా ఉన్న రోడ్డు దెబ్బతిన్నాయని వాటిని వెంటనే ఆధునీకరించాలని డిమాండ్ చేశారు.

నగరంలో అవసరమైన ప్రతి చోట కొత్త రోడ్లు: రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్..

నగరంలో అవసరమైన ప్రతి చోట వెంట నే ఆధునీక రోడ్లు వేస్తున్నామని నగర ఇన్‌చార్జి రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను ఆధునీకరించేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్లపై వర్షం నీరు నిలవ కుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వరద నీటి నాలాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా  అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... రోడ్డును పునర్ నిర్మించాలని జీహెఎంసీ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. రోడ్డు పనులు పూర్తి అయితే ప్రజల రాకపోకలకు, స్థానికులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నా రు.

ఈ కార్యక్రములో కార్పొరేటర్లు రవిచారి, సుప్రియా నవీన్ గౌడ్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్లు ఆర్. కల్పనాయాదవ్, వాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యదర్యులు జీఎన్ కేశవ్, యాదగిరి, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సయ్యద్ మోహినుద్దీన్, యూత్ కాంగ్రెస్ నగర నాయకుడు సంగ పాక వెంకట్, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యకుడు భరత్ గౌడ్, బీజేపీ రాష్ర్ట నాయకుడు బిజ్జి కనకేష్ కుమార్, నందగిరి నరసింహ, సత్యనారాయణ, భోలక్ పూర్, రాంనగర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, శంకర్ ముదిరాజ్,

బీజేపీ అధ్యక్షులు రాజశేఖర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెండం శ్రీనివాస్ యాదవ్, జఫర్ ఉద్దీన్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బింగ్ నవీన్, శివ ముదిరాజ్, ముచ్చ కుర్తి ప్రభాకర్, కె. మాధవ్, జావిద్భాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి. వెంకటేష్, పట్నం  నాగభూషణం గౌడ్, లింగాల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిపనులను రాజకీయం చేస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు: టీపీసీసీ రాష్ర్ట కార్యదర్శి..

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలామ్ చేసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ రాష్ర్ట కార్యదర్శి జీఎన్ కేశవ్ విమర్శించారు. సీసీ రోడ్డు ప్రారంబోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీ నేతల విదానాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎన్ కేశవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలను చేయడం. సిగ్గుచేటన్నారు. మతం పేరుతో బీజేపీ అధికార దాహంతో బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఉండాలని అభివృద్ది పనుల విషయంలో ఉండకూడదని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిపనులకు సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.