calender_icon.png 11 August, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బస్తీవాసుల సాధక బాధకాలు తెలుసుకున్నాను’

11-08-2025 01:55:10 AM

  1. భారీ వర్షాల సమయంలో  జాగ్రత్తలు తీసుకోవాలి 
  2. సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : ‘బల్కంపేట ప్రాంతంలోని బుద్దనగర్, గం గుబాయి బస్తీ, మైత్రీవనంలో ప్రాంతాల్లో  అకస్మికంగా పర్యటించాను. భారీ వర్షాల నే పథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశాను’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు.

కాలనీల్లోని ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా నీటి ప్రవాహం జరిగి, ముంపు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను, డ్రైనేజీ వ్యస్థలను పరి శీలించినట్లు తెలిపారు. బస్తీవాసులతో మా ట్లాడి, వారి సాధక బాధకాలు నేరుగా అడిగి తెలుసుకున్నట్లు సీఎం చెప్పారు. భారీ వర్షా ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న సీఎం పలు సూచనలు చేశారు.