సిమెంటు రోడ్డు నిర్మాణ పనుల పర్యవేక్షించిన బి ఆర్ ఎస్ నాయకులు
09-07-2026 05:35 PM
విజయక్రాంతి ఉప్పల్ జులై 9: సుమారు 30 లక్షల రూపాయలు వ్యయంతో బాబా నగర్ లోని జరుగుతున్న సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ నూతన సిమెంట్ రోడ్డులు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి సహకారంతో మాజీ కార్పొరేటర్ హయంలో సిమెంట్ రోడ్లు నిర్మాణాలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు . ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి రామచందర్ పొన్నాల మహేందర్ జెరిపోతుల భాస్కర్ నయీమ్ రాజు గౌడ్ కట్ట బుచ్చన్న గౌడ్ అశోక్ దేవా మల్లేష్ మల్లికార్జున్ గౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






