దాడి చేసిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలి
09-07-2026 05:29 PM
నిర్మల్ జులై 9( విజయ క్రాంతి): భైంసాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే బుచ్చయ్య పై దాడి నీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీజీ రెడ్డి రమేష్ తెలిపారు. (GRP)లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల కాఫీ కొడుతుండగా ప్రిన్సిపల్ పట్టుకోగా అతనిపై విద్యార్థి దాడి చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని అధ్యాపకులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.






