28 May, 2026 | 2:56 AM

పులిపలుపుల మహేశ్ కుటుంబానికి కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శ

28-05-2026 01:59 AM

ఆలేరు, మే 27 (విజయక్రాంతి): బీజేపీ నాయకుడు పులిపలుపుల మహేష్ కుమారుడు పులిపలుపుల రాఘవ రోడ్డు ప్రమాదంలో ఈనెల 18న మరణించిన విషయం విధితమే. కాగా బుధవారం రాత్రి 9 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పులిపలుపుల మహేష్ ని ఆలేరులోని ఆయన స్వగృహంలో పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ చిరంజీవి రాఘవ అతి చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరమన్నారు. ఈయన వెంట ఊట్కూరు అశోక్ గౌడ్, చిరిగి శ్రీనివాస్, కామిటికారి కృష్ణ, తునికి దశరథ, నంద గంగేష్, ఎలుగల వెంకటేష్, సుక్క రాజు మరియు బిజెపి శ్రేణులు, కాలనీవాసులు ఉన్నారు.