16 April, 2026 | 11:05 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

07-06-2025 06:10 PM

కొత్తపల్లి: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) తెలిపారు. అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.31 కోట్ల 12 లక్షల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. శనివారం రోజున కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు.

అనంతరం కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్ లో 9 లక్షల 50 రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ‘‘కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొత్తం పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా రోడ్లను నిర్మిస్తున్నాం. ఈసారి ఈ పథకం కింద దాదాపు 31 కోట్ల 12 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈ కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది 74 లక్షల రూపాయలను విడుదల చేశారు. అందులో భాగంగా ఖాజీపూర్ లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 14 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.’’అని పేర్కొన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సిఆర్ఐఎఫ్) కింద రూ. 291 కోట్లను ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించామన్నారు. తెలంగాణలోనే అత్యధికంగా సిఆర్ఐఎఫ్ నిధులను తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్లను నిర్మించగలగడం సంతోషంగా ఉందన్నారు. ఇవిగాకుండా ప్రధానమంత్రి సడక్ యోజన కింద వందల కోట్లను ఖర్చు చేసి మారుమూల గ్రామాల్లో రోడ్లను నిర్మించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట తిరుపతి, మాజీ మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి అంజనీకుమార్ సీనియర్ నాయకులు జవ్వాజి రమేష్ కట్ల శ్రీనివాస్ కడారి శ్రీనివాస్ సోమినేని కరుణాకర్ మీరు మల్లేశం ఇల్లందుల ఆనంద్ బైరెడ్డి వంశీ బోనాల నరేష్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మరియు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.