బంగారం కొంటామని వచ్చి కాల్పులు జరిపారు
అనుకోని దురద్రుష్టకర సంఘటన
దుండగులను కచ్చితంగా పోలీసులు పట్టుకుంటారనే నమ్మకముంది
పోలీస్ కమిషనర్ ఆధ్వర్వంలో పోలీసులు దుండుగుల కోసం గాలిస్తున్నారు
పీఎంజే జ్యువెల్లర్స్ చోరీపై కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్,(విజయక్రాంతి): కాల్పుల సంఘటన తెలియగానే హుటాహుటిన జ్యువెల్లరీ షాపుకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చోరీ ఘటనపై ఆరా తీశారు. దుండుగులను అడ్డుకునేందుకు సిబ్బంది చూపిన తెగవ ప్రశంసనీయమన్న బండి సంజయ్ అన్నారు. కాల్పుల ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నామన్నారు. బంగారం కొనుగోలు చేస్తామని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడి కాల్పులు జరిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘అనుకోని సంఘటన ఇది.
ఈ ఘటన జరిగే సమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఏరియాలోనే పలు అభివ్రుద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న. పోలీసులు కూడా ఉన్నారన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారని దుండుగలను కచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం ఉంది’’అని తెలిపారు.
కరీంనగర్ లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపు సిబ్బందిపై దుండగుల కాల్పుల ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు. జ్యువెలరీ షాపులోని సీసీ పుటేజీని పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు. అసలేం జరిగింది అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత పోలీస్ కమిషనర్ తోపాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది అనుకోని సంఘటన. అత్యంత దురద్రుష్టకరం. సీసీ పుటేజీ, సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి మొత్తం ఐదుగురు దుండుగులు చోరీ చేయడానికి జ్యువెలరీ షాపులోకి వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. తొలుత ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలి చూపాలన్నారని కాసేపటికే మరో ఇద్దరు వచ్చి గోల్డ్ అభరణాలు కొంటాం... చూపాలన్నారని. బంగారు ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు వచ్చారని దుండుగులు తెలుగు, హిందీ భాషలు మాట్లాడుకున్నారని తెలిపారు.
ఐదుగురు కలిసి తుపాకులు చూపించి బెదిరించి అభరాణలను చోరీ చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న షాపు సేల్స్ మేనేజర్, ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారని సిబ్బంది చాలా ధైర్యంగా తెగించి అడ్డుకున్నారని. ఆ క్రమంలోనే వారికి గాయలయ్యాయన్నారు. ఇప్పటి వరకైతే ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నారని అయినప్పటికీ బాధితులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నామన్నారు.
ఈ ఘటన జరిగే సమాయానికంటే 10 నిమిషాలకు ముందే షాపు సమీపంలోనే అభివ్రుద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నామని ఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై కరీంనగర్ ను చుట్టుముట్టారని దుండుగులను పట్టుకుంటారనే నమ్మకం ఉందన్నారు ఏదేమైనా అధికారులు సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారని కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారని. క్లూస్ టీం వచ్చిందని బాధితుల స్టేట్ మెంట్ తీసుకుంటున్నారని దొంగ తనం చేయడానికే షాపులోకి చొరబడ్డట్లు తెలుస్తోందని సిబ్బంది అడ్డుకోవడంతో ఒక బ్యాగును ఇక్కడే జార విడిచారన్నారు. ఎంత గోల్డ్, ఇతర అభరణాలు ఎత్తుకెళ్లారనేది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు.






