3 May, 2026 | 2:56 PM

65 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ

03-05-2026 02:05 PM

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 65 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదీలయ్యారు. సీవీ ఆనంద్  కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను బలోపేతం చేయడమే ఈ పునర్వ్యవస్థీకరణ లక్ష్యమని అధికారులు తెలిపారు. పోలీసు విధి నిర్వహణలో పారదర్శకతను, సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఆ శాఖ ఆశిస్తోంది. ఈ కారణంగానే, అధికారులు బలగాల మధ్య భారీ ఎత్తున బదిలీలను చేపట్టినట్లు సమాచారం.

ఈ బదిలీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లకు వర్తిస్తాయని, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అంతటా ఆశించిన విస్తృత మార్పులకు ఈ చర్య నాంది పలుకుతోందని అధికారులు వెల్లడించారు. రమేష్ రెడ్డి 65 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. చాలా మంది అధికారులు ఒకే ప్రాంతాల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్నారని వర్గాలు తెలిపాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని శాఖ నిర్ణయించింది.