3 May, 2026 | 3:28 PM

దేవాపూర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

03-05-2026 02:12 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండలం రాంపూర్, దేవాపూర్ గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మందమర్రి  సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్,దేవాపూర్,కాసిపేట ఎస్ ఐ లు, సిబ్బంది ఆకస్మికంగా గ్రామాల్ని చుట్టుముట్టాయి. తనిఖీలు చేశారు.  అనుమానస్పద వ్యక్తుల గురించి ఆరా తీశారు. అపరచిత వ్యక్తులకు ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా ? అనే కోణంలో విచారించారు. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డులను పరిశీలించారు. అదేవిధంగా  ద్విచక్ర వాహనాలు ఆర్ సి,  ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లు చెక్ చేశారు.

ద్రువపత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 53 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటికి అక్కడికక్కడే ఫైన్ వేశారు.  3 నెంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాలను సీజ్ చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, దేవాపూర్ ఎస్సై గంగారాం మాట్లాడారు. స్థానిక ప్రజలకు  సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, కోత్త చట్టాలు, మూఢ నమ్మకాల పై అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలనికోరారు. ట్రాఫిక్ నిబంధన లను వివరించారు.