25 April, 2026 | 7:11 AM

కేటీఆర్.. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు: బండి సంజయ్‌

23-10-2024 02:17 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు.. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా..? అని ప్రశ్నించారు. తనను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చా అన్నారు. అయితే నీకూ నోటీసు పంపుతా.. కాచుకో అంటూ బండి సంజయ్‌ సవాల్ విసిరారు. మాటకు మాట... నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, డ్రగ్స్‌పై చేసిన వ్యాఖ్యలపై కేటీ రామారావు బుధవారం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.