10 August, 2026 | 3:28 PM

మాతృభూమికి బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం

19-06-2024 03:48 PM

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ కేంద్రమంత్రి హోదాలో మొదటి సారి కరీంనగర్ లో అడుగుపెట్టారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బండి సంజయ్ కి బీజేపీ అధిష్టానం కేంద్రమంత్రి పదవి ఇచ్చింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా కరీంనగర్ కు వచ్చిన సందర్భంగా కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ శ్రేణులు కేరింతలు కొట్టారు. నేడు మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.