10 August, 2026 | 2:20 PM

రేవణ్ణ కస్టడీ పొడిగింపు

19-06-2024 04:02 PM

బెంగళూరు: అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న జేడిఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. అత్యాచార కేసులో నిందితుడైన రేవణ్ణ మే 31న జర్మనీ నుంచి బెంగళూరు వచ్చారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆయన ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా జూన్ 18 వరకు కస్టడీ విధించింది. అతను 47 ఏళ్ల మాజీ పనిమనిషిని లైంగికంగా వేధించాడని, పలువురు మహిళలపై అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను చిత్రీకరించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ సిట్ కస్టడీలో ఉన్నారు.