7 June, 2026 | 2:00 AM

బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి సేవలు

07-06-2026 12:00 AM

త్వరలోనే ప్రధాని చేతులమీదుగా ప్రారంభోత్సవం

వైద్య విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎయిమ్స్‌లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఆలేరు, జూన్ 6 (విజయక్రాంతి): యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. వైద్య విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగ స్వాములు కావాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను శనివారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ అమిత అగర్వాల్, ఇతర ఉన్నత విభాగాల అధిపతులు, విద్యార్థులతో మాట్లాడి ఎయిమ్స్‌కి సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ.. బీబీనగర్ ఎయిమ్స్‌లో త్వరలోనే పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఆ దిశగా భవన నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.

బీబీనగర్ ఎయిమ్స్ దేశంలోనే అత్యుత్త వైద్య సంస్థగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్నదని పేర్కొన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే ప్రధాని లక్ష్యమన్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే మానవ మనుగడ సాగిస్తుం దన్నారు. కిషన్‌రెడ్డి వెంట ఆర్డీవో కృ ష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గూ డూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి తరుణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీకాంత్‌గౌడ్, లక్ష్మారెడ్డి ఉన్నారు.