ఆటోలో కేంద్ర మంత్రి ప్రయాణం
13-06-2026 12:08 AM
రేకొండ నుంచి చిగురుమామిడి వరకు వెళ్లిన బండి సంజయ్
కరీంనగర్, జూన్12 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా రేకొండ నుంచి చిగురుమామిడి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆటోలో ప్రయాణించారు. మోదీ పన్నెండేళ్ల పాలనా విజయాలపై ఆటో డ్రైవర్‌కు పుస్తకాలను కేంద్ర మంత్రి అందజేశారు.
అలాగే ఆటో డ్రైవర్ దిలీప్‌తో మోదీ పాలనలో ప్రజలేమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. మోదీ పాలనలో ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలేమిటని ఆరా తీశారు. చిగురుమామిడి మండలంలో టిఫిన్ బైటక్‌లో పాల్గొన్న బండి సంజయ్ తిరుగు ప్రయాణంలో ఆటో బైటక్ చేశారు.






