పది ఫలితాల్లో యూనిక్ ప్రభంజనం
01-05-2024 02:01 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి యూనిక్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ స్థాయిలో గత నాలుగు సంవత్సరాలతో పాటు ఈ ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. 22 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా 93 మంది విద్యార్థులు 9/10 జీపీఏ తెచ్చుకున్నారు. పది ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ పీ శివయ్య, ప్రధానాచార్యులు ఎం నాగభూషణం అభినం దించారు. పాఠశాల నుంచి మొత్తం 147 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 146 మంది విద్యార్థులు (99.3 శాతం) ఉత్తీర్ణత సాధించారు.




