9 April, 2026 | 4:14 PM

గాంధీ భవన్‌లో NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

09-04-2026 02:53 PM

హైదరాబాద్: గాంధీ భవన్(Gandhi Bhavan)లో NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట స్వామి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేశారు. భారత జాతీయ విద్యార్థి సంఘం (National Students' Union of India) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ పతాకాన్ని ఆవిష్కరించే అదృష్టం తనకు లభించినందుకు  మహేష్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రి పొన్నం ప్రభాకర్, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, గడుగు గంగాధర్ తో పాటు  పలువురు నాయకులు పాల్గొన్నారు.