9 April, 2026 | 5:28 PM

రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలి

09-04-2026 03:28 PM

వెలుగు పల్లిలో 10 కోట్లతో గోదాముల నిర్మాణం.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

తుంగతుర్తి (విజయ క్రాంతి): గ్రామాల్లోని రైతుల ప్రయోజనాల కోసమే గోదాముల నిర్మాణం ప్రభుత్వం చేపట్టినట్లు, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామం శివారులో గల రుద్రమ్మ చెరువు వద్ద 10 కోట్ల వేముతో నూతన గిడ్డంగులు ఏర్పాటు కార్యక్రమంలో భూమి పూజ  చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో అడ్డగూడూరు కేంద్రంలో నూతనంగా పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గానికి అదనంగా 2000 నూతన ఇందిరమ్మ ఇండ్లు ఉచిత మహాలక్ష్మి పథకం 500 కే గ్యాస్ కనెక్షన్ సన్న బియ్యం పంపిణీ పేద ప్రజల గుండెల్లో అభివృద్ధి పథకాలు నిలిచిపోయాయని అన్నారు. మద్దిరాల నూతనకల్ మండలాల నడుమ నూతనంగా జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. వెలుగు పల్లి గ్రామానికి సుమారు గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు.

అనంతరం ఎఐసిసి సభ్యులు , యువనేత రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో భాగంగా  గ్రామానికి నూతన గిడ్డంగుల నిర్మాణం రావడం సంతోషకరమైన విషయమని అన్నారు దీనితో రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నట్లు తెలిపారు. ఎక్కడ అభివృద్ధి అవకాశం ఉన్న తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు, రానున్న ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యోగానంద చారి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, వెలుగుపల్లి సర్పంచ్ నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు కొరికొప్పుల నరేష్ గౌడ్, జిల్లా నాయకులు రేగటి రవి, కొండరాజు, మాచర్ల అనిల్ ,నాగరాజు, దాసు, తాసిల్దార్ దయానందం ఎంపీడీవో శేష్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.