9 April, 2026 | 4:20 PM

నిర్మల్ లో ఆధునిక వైద్య చికిత్సలు

09-04-2026 02:45 PM

నిర్మల్ ఏప్రిల్ 9 ( విజయక్రాంతి): హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం ఉమ్మడి జిల్లా వాసులకు నిర్మల్ లో అన్ని రకాల వైద్య  చికిత్సలు నిర్మల్ లో అందుబాటులో ఉన్నాయని ఆర్థోపెటిక్ జనరల్ సర్జన్ వైద్యులు డాక్టర్ జయ కృష్ణారెడ్డి తెలిపారు. అత్యవసర ప్రమాదాల్లో గాయపడిన ట్వంటీ పరీక్షలు మోకాల పరీక్షలు మోకాలు రిప్లేస్మెంట్, ట్రా మకీర్, పాలిట్రామ, నడుము కండరాల నొప్పులకు సంబంధించిన అన్ని రకాల ఆధునిక టెక్నాలజీ సర్జరీ నిర్మల్ లో అందుబాటులో ఉంటుందన్నారు. నిర్మల్ పట్టణంలోని దేవేందర్ హాస్పిటల్లో, సూర్య హాస్పిటల్ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు, తక్కువ ప్యాకేజీకి ఈ వైద్యం అందిస్తున్నట్టు వివరించారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ యశోద ఆర్థోపెడిక్ విభాగం ఈ ప్రాంతంలో ఇటువంటి సేవలు అందిస్తున్నామని ప్రజలు అధ్యయనం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు