8 August, 2026 | 1:15 AM

సాంప్రదాయ థ్రిల్లర్లకు భిన్నంగా అగధ

08-08-2026 12:00 AM

కామాక్షి భాస్కర్ల (‘పొలిమేర’ ఫేమ్), శ్రవణ్‌రెడ్డి (‘డర్టీ హరి’ ఫేమ్ ) ప్రధాన పాత్రల్లో నటించిన తాజాచిత్రం ‘అగధ’. ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అతీంద్రియ శక్తులు, అద్భుత శక్తులు, శక్తిమంతమైన దైవిక నేపథ్యాల మేళవింపుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా సాంప్రదాయ థ్రిల్లర్లకు భిన్నంగా అలరించనుంది.

ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవ సీజన్‌లో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రానికి సం గీతం: రాకేశ్ వెంకటాపురం; సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి; ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ; ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్.