24-04-2025 12:56:51 AM
బీజేపీ నాయకుడు రఘునాథ్ వెరబెల్లి
లక్షెట్టిపేట, ఏప్రిల్ 23 : రైతులు పండించిన పంటకు కటింగ్ పేరుతో బస్తాకు 2 కిలోలు దోచు-కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని బీజేపీ నాయ కులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. బుధవారం మండలంలోని కొత్తూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ శ్రేణులతో సందర్శించి వడ్ల కొనుగోలు తీరును పరిశీలించి అక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్య-లను అడిగి తెలు సుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లా-డుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కట్టింగ్ లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్తూ ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ప్రతి బస్తాకు 40 కేజీల బస్తాకు 2 కేజీలు అదనంగా కాంటా వేసి రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభు త్వం దోచుకుంటుందని తెలిపారు.
ఈ విషయం పై ఇటీవల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి అదనంగా కాంటా పెట్టవద్దని చెప్పినప్పటికీ కలెక్టర్ మాటలు భేఖాతరు చేస్తూ అదనంగా 2 కేజీలు కంటా వేస్తున్నారన్నారు. అదే విధం గా రైతులు పండించిన ధాన్యానికి తూర్పార పట్టడం అవసరం లేనప్పటికీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ తూర్పార పట్టించడం సరికాదన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుకు రసీదు ఇవ్వాలని, ఎలాంటి కట్టింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, పెద్దపల్లి పురుషోత్తం, మాథవరపు వెంకట రమణ రావు, గుండా ప్రభాకర్, తగరపు గంగన్న, వీరమల్ల హరి గోపాల్, రాజా గురువయ్య, ముష్కం గంగ న్న, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.