3 July, 2026 | 9:28 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

ఆగని లైంగిక వేధింపులు

02-09-2024 12:29 AM

కోల్‌కతా, సెప్టెంబర్ 1: బెంగాల్‌లో దవాఖానల్లో మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు ఆగటం లేదు. ఒకవైపు ట్రెయినీ డాక్టర్ హత్యపై తీవ్ర వివాదం కొనసాగుతుండగానే, మరోవైపు రెండు దవాఖానల్లో అలాంటి ఘటనలే వెలుగు చూశాయి. బిర్భూమ్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో విధుల్లో ఉన్న ఓ నర్సుతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. జ్వరంతో దవాఖానకు వచ్చిన వ్యక్తికి తాను స్లున్ పెడుతుండగా అతడు తనను అభ్యంతరక రంగా తాకుతూ బూతులు తిట్టాడని నర్సు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశా రు. హౌరాలోని ఓ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అమన్‌రాజ్ అనే వ్యక్తి సిటి స్కాన్ కోసం వెళ్లిన 13 ఏండ్ల బాలికను వేధించాడు. బాలిక తల్లి కేకలు వేయటంతో  స్థానికులు భారీగా తరలివ చ్చి అమన్‌పై దాడిచేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్టు చేశారు.