3 July, 2026 | 9:31 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి

03-07-2026 08:44 PM

బేల,(విజయక్రాంతి): బేల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)ను మండల ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీవో మహేష్, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, వసతి, సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వంటగది, స్టోర్ రూమ్ తో పాటు పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రత, ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలపై తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని పాఠశాల సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.