3 July, 2026 | 9:35 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

తాగారు.. దొరికారు..

03-07-2026 08:46 PM

- 'డ్రంక్ అండ్ డ్రైవ్'లో 45 మంది పట్టివేత 

- రూ.4.72 లక్షల జరిమానా 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన  తనిఖీల్లో 45 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. విచారణ అనంతరం 45 మందికి కలిపి రూ.4 లక్షల 72 వేలు జరిమానా న్యాయమూర్తి విధించారని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ 38 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారందరికీ కలిపి రూ. లక్షా 76 వేల 5 వందలు జరిమానా విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ ముత్యంరాజు స్పష్టం చేశారు.