అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా గద్వాల్ రైల్వే స్టేషన్ పరిసరాలు
గద్వాల ( వనపర్తి ), విజయక్రాంతి : జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రైల్వే స్టేషన్ కు దగ్గర్లోనే బహిర్ భూమిలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ పొదల చాటున కొంతమంది వేశ్యలు స్థానికంగా ఉండే యువతను టార్గెట్ చేసి వల విసురుతున్నారు. ఇదంతా జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే జరుగుతున్న స్థానిక పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికంగా ఉండే యువత వేశ్యల మోజులో పడి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో అంత గందరగోళ్ల వాతావరణం నెలకొంది మరి కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే పరిస్థితి అదుపుతప్పి వేశ్యలకు అడ్డాగా మారిపోతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






