17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఆగని పసిడి పరుగులు

17-06-2025 12:00 AM

ఎంసీఎక్స్‌లో లక్ష దాటిన బంగారం ధర

ముంబై, జూన్ 16: బంగారం ధరలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ (ఎంసీఎక్స్) ఆగస్ట్ ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,01,078కి చేరుకుంది. ఈ విధంగా ధరలు పెరగడంతో మధ్యతరగతి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

వెండి ధర కూడా కేజీ 1,06,464 రూపాయలకు చేరుకుంది. ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి కారణాలు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3450 డాలర్లు దాటింది.