24 March, 2026 | 11:56 AM

ఆగని కరోనా వ్యాప్తి

02-06-2025 01:07 AM
  1. ఒక్క రోజులోనే 1200 శాతం పెరిగిన కేసులు
  2. 3,758కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

న్యూఢిల్లీ, జూన్ 1: భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూ డు వేల మార్కును దాటిన కేసుల సంఖ్య తాజా గా 3758కి చేరుకుంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదై న కేసుల్లో ఈ రాష్ట్రాల నుంచే దాదాపు 75 శాతం కేసులు నమోదవడం గమనార్హం. కేరళలో అత్యధికంగా 1,400 కేసులు వెలుగుచూశాయి.

గత వారంలోనే ఇక్కడ 970 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 485 కేసులు ఉన్నా యి. మే 26 నుంచి జూన్ 1 వరకు 272 శాతం కొత్త కేసులు నమోదయినట్టు ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. గత వారంతో పోల్చుకుంటే కేసుల పెరుగుదల 1200శాతం ఎక్కువగా నమోదైంది.