12 March, 2026 | 10:23 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అకాల వర్షం... అవస్థలు పడిన రైతులు

03-11-2025 01:49 AM

ఎల్లారెడ్డి, నవంబర్ 2 (విజయ క్రాంతి): అకాల వర్షం కురియడంతో రైతులు అవస్థలు పడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఉదయం నుంచి వర్షాలు పడడంతో వరి ధాన్యం కల్లాలలో ఉండడంతో తడిసి ముద్దయింది. ఎండ కొడుతూ ఒకేసారిగా మబ్బులు వచ్చి వర్షం కురియడంతో గాలి వాన రావడంతో కల్లాలో  ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయినట్లు రైతులు తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షం కురిసింది.

మండలంలోని జంగంపల్లి ఉర్దూ లక్ష్మాపూర్ రాంపూర్ కొట్టాల్ గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షం రావడంతో వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని రక్షించుకు నేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం చేతికి వచ్చి అమ్ముకునే సమయంలో అకాల వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.