03-11-2025 01:44:56 AM
జహీరాబాద్, నవంబరు 2 :వర్షాకాలం ప్రారంభమైన నాటి నుండి వర్షాలు అధికంగా కురియంతో రైతులు విలవిలలాడుతు న్నారు. వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతు లు కన్నీరు పెడుతున్నారు. ఆదుకునే ప్రభుత్వాలు లేక తెచ్చిన అప్పులు తీర్చలేక బిక్కు బిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ప్ర తి సంవత్సరం రైతులకు రైతుబంధు కింద గత ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయ లు సకాలంలో ఇవ్వడంతో రైతులు ఆనందంతో తమ పంట పొలాల్లో వ్యవసాయాన్ని సాగు చేశారు. ప్రభుత్వం మారి రెండేళ్ళు గడుస్తున్నప్పటికీ రైతులకు ఇవ్వవలసిన రెం డు పర్యాయాల రైతు భరోసా కింద ఇవ్వవలసిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేయలే దు.
ఈ సీజన్లో వర్షాలు అధికంగా వర్షం పడడంతో పత్తి పంట వేసిన రైతులు ఎకరాకు 30 నుండి 40 వేల రూపాయల వర కు నష్టాలు వచ్చాయి. ప్రతి సంవత్సరం ఎకరానికి పత్తి పంట పది నుంచి 15 క్వింటాళ్ల వరకు దాదాపుగా వచ్చినప్పటికీ రైతులు ఎంతో కొంత లాభపడ్డారు. కానీ ప్రస్తుత సీజన్లో వర్షాలు అధికంగా కురియడంతో ప త్తి పంట ఎదుగుదల కాలంలోనే క్షీణించిపోయింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం తో పత్తి పంటలో రెండు మూడు క్వింటలు మాత్రమే దిగుబడి రావడంతో రైతులు లబోదిబోమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
కానరాని రైతు భరోసా...
రైతు భరోసా వచ్చినట్లయితే ఎంతోకొం త తమకు మేలు జరిగేదని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పత్తి పంటను వేసి నప్పటికీ రైతులకు కలుపు తీయడం కానీ మందులు వేయడానికి వర్షం సహకరించకపోవడంతో పొలాల్లోనే పత్తి పంటను వదిలి వేశారు. దీంతో వారికి అపార నష్టం సంభవించింది. ప్రభుత్వం పంట నష్టపోయిన రై తులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురుచూస్తున్నా లాభం లేకుండా పోయింది.
పత్తి తో పాటు రైతులు సోయాబీన్ విత్తనాలు తీ సుకువచ్చి పంట వేసినప్పటికీ వర్షాలు సహకరించకపోవడంతో సోయా పంటలు కూడా నశించిపోయాయి. సోయాబీన్ ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని అనుకున్న రైతులకు రెండు మూడు క్వింటలే దిగుబడి రావడంతో నష్టాలను చూశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రబీ సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నప్పటికీ పొలాలు ఆరక పోవడంతో వేయవలసిన శనగ, ఆలుగడ్డ పంట లు వేయడానికి భూములు పచ్చిగా ఉండడంతో రైతులు అయోమయానికి గురవుతు న్నారు .ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రైతు భరోసాతో పాటు పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సా యం చేయాలని కోరుతున్నారు.