calender_icon.png 3 November, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరు మోటార్లకు మరమ్మతులు

03-11-2025 01:50:23 AM

బిచ్కుంద, నవంబర్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల బోరు మోటర్ లు చెడిపోయి నీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని స్థానికులు కాంగ్రెస్ నాయకులకు విన్నవించడంతో వారు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కమిషనర్ హయ్యాబ్ కు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బోరు మోటార్లకుమరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బోరు మోటర్ చెడిపోయి నీళ్లు రావట్లేదన్న విషయాన్ని తెలుసుకొని బిచ్కుందలో బసవన్న మందిరం దగ్గర బోరు మోటర్ రిపేరు చేయించి నీళ్ళ సౌకర్యం కల్పించారు.

బాన్సువాడ టు బిచ్కుంద రోడ్డు ప్రక్కన గల కంచిగారు కుంట నుండి భద్రకాళి మందిరం వరకు జెసిపి సాయంతో ముళ్ళ పొదలను తొలగిస్తూ రోడ్డును చదను చేశారు. మొగులాలి గుర్రం దేవుని దగ్గర ప్రజల యొక్క విన్నపాలు వింటూ అక్కడ ఉన్న బోరు మోటారును మరమత్తులకు పంపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిచ్కుంద మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, దశరథ్ స్వామి, చింతల హన్మండ్లు, లింగురం గంగారం,తుకారం సాయిని అశోక్, బండు పటేల్,  బాలకృష్ణ, ధర్పల్లి సంతోష్, ఖలీల్, బసవరాజ్, బుక్కవారి సంజు మోహన్ నాయక్, బిచ్కుంద మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ మాజి అధ్యక్షులు బొగడమీద సాయిలు తదితరులు పాల్గొన్నారు.