12 April, 2026 | 6:28 AM

అకాల వర్షాలు.. అపార నష్టాలు!

05-11-2025 12:00 AM
  1. రైతులను ముంచెత్తిన ముసురు వాన

మొన్న మొంథా..నేడు కుండపోత వాన 

నేలకొరిగిన పత్తి, వరి పంటలు 

మెత్తబడిన రహదారులు 

నాగర్ కర్నూల్ నవంబర్ 4 ( విజయక్రాంతి )ఈ ఏడది అకాల వర్షాలు రైతాంగా నికి అపారమైన నష్టాన్ని కలిగించాయి. పంటలు సాగు చేసే సమయం నుండి అడపదడపా కురిసిన వర్షాలతో తెగుల నుండి కాపాడుకున్న రైతాంగం చివరగా పంట కాపు దశలో అకాల వర్షాలు నిండా ముం చాయి.

గత వారం రోజుల క్రితం మొంథా తుఫాను కారణంగా పత్తి, వరి, మొక్కజొన్న, వేరుసెనగ వంటి పంటలు పూర్తిగా దెబ్బతినగా మంగళవారం కురిసిన కుండపోత వానతో రైతాంగం కకా వికలం అవుతోంది. ఈ వానకాలం పత్తి 2,61,640 ఎకరాలు, వరి 1,01,048 ఎకరాలు, కందులు 3,406 ఎకరాలు, మొక్కజొన్న 51,128 ఎకరాలు, జొన్న 4,213 ఎకరాలు, మినుములు 634 ఎకరాలు, ఆముదం 31 ఎకరాలు మొత్తం 4,22,100 ఎకరాలు పంట సాగు చేశారు.

కానీ గత వారం రోజుల క్రితం మొంథా తుఫాను ప్రభావంతో 18వేలు పత్తి, 10వేల ఎకరాలు వరి, 2600 ఎకరాలు వేరుషనగ, 708 ఎకరాలు మొక్కజొన్న, 940 ఎకరాలు మినుములు వంటి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. కానీ దుందుభి వాగు పరిసర గ్రామాల్లోని పంట పొలాలు ప్రధాన వాగు పరిసరాల్లోని పంట పొలాలు పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. వాటి లెక్క సుమారు రెట్టింపు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

వాటి నుంచి తెరుకొకముందే మంగళవారం కందనూలు జిల్లాలో కురిసిన కొండపూత వాన కారణంగా పత్తి, వరి పంటలు వరద నీటిలో ము నిగిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కాపు దశలో ఉన్నప్పటికీ వరుస గా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పత్తి తీయలేని పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తీసిన పత్తి పంటను కూడా అమ్ముకునేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ పే రుతో కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయ డం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకుంటున్నామని రైతులు బోరు మంటున్నారు. 

పత్తి కొనుగోలు చేయక మరింత ఆగం

 వరుసగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పంట మీద ఉన్న పత్తిని తీసి అమ్ము కునేందుకు వెళితే సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది. జిల్లా ఉన్నతాధికారులు సైతం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా పత్తి కొనుగోలు జరగడంలేదని తేమ పేరుతో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయకుండా దళారుల పత్తి మాత్రమే కొనుగోలు చేయడం పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు అమ్మిన పత్తిని దళారుల నుంచి మాత్రం ఎలా కొనుగోలు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద తేమ ఉన్నప్పుడు దళారుల వద్ద తేమ రావడం లేదా అంటూ ప్రశ్నించారు. మంగళవారం ఉదయం తాడూరు మండలం ఇం ద్రకల్ గ్రామ పరిసరాల్లోని సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. అ యినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు చేసేదేం లేక వెనుతిరిగి పోయారు.

మొంత తుఫాను కారణంగా అచ్చంపేట మండలం మర్లపాడు తాండ పూర్తిగా ముం పుకు గురయ్యారు. నిర్వాసితులకు పరిహారం అందించాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ డిమాండ్ చేయగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండవస్తులను కాపాడేందుకు పరిహారాన్ని ప్రకటిస్తూ జీవో విడుదల చేశారు. 

మెత్తబడిన ప్రధాన రహదారులు.

 ఏడాది అకాల వర్షాల కారణంగా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు జడ్చర్ల మన్ననూర్ వంటి ప్రధాన రహదారులు అంతర్ జిల్లాల రహదారులు పూర్తిగా మెత్తబడ్డాయి దుందుభి వాగు పరివాహక రహదారులు వరద తాకిడికి కోత గురయ్యాయి. మొంథా తుఫాను కారణంగా డిండి చెరువు అలుగు పారి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో రెండు రోజులపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజ కవర్గాల అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులు కూడా ముసురు వర్షాలకు మెత్తబడ్డాయి. ఇసుక అక్రమ రవాణా, మట్టి తరలింపు, కంకర ఇతర గులకరాళ్ళ తరలిం చే టిప్పర్లు అధిక లోడుతో ప్రయా ణిం చడంతో అడుగుకు ఒక గుంత చొప్పున రహ దారులు గతుకుల రోడ్డులుగా మారా యి.

చిన్నచిన్న వాహనాలు గతుకుల రోడ్ల బారిన పడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ బరువుతో గల వా హనాలు రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో మెత్తబడ్డ రోడ్లన్నీ ధ్వంసం అవుతు న్నాయి. ఫలితంగా ప్రజా రవాణా పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతోందని పలువురు ఆ రోపిస్తున్నారు. 

నాళాలు ఆక్రమణ చేయడం తో వర్షపు నీరంతా మురుగు కాలువల గుం డ ప్రవహించకపోవడంతో ప్రధాన రోడ్ల వెంట వర్షపు నీరు చేరి రోడ్లు ధ్వంసం కావడానికి మరో కారణమవుతున్నాయి. అయి నా సంబంధిత మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు ఎవరూ పట్టించుకోకపో వడంతో వర్షపు నీరు రోడ్ల వెంట చేరి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ అకాల వర్షాలు అపారమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి.