04-11-2025 10:56:25 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): శ్రీలంక అంతర్జాతీయ క్రీడా సదస్సుకు డాక్టర్ బి.లక్ష్మయ్య హైదరాబాద్ శ్రీలంక రాజధాని కొలంబియాలో జరిగే అంతర్జాతీయ క్రీడా సదస్సుకు కాచిగూడ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.లక్ష్మయ్య పాల్గొంటారు. ఈ సదస్సు ఈనెల 6, 7వ తేదీల్లో కొలంబియాలో జరుగుతుంది. క్రీడల అభివృద్ధిలో మీడియా పాత్ర అనే అంశంపై ఆయన పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
శ్రీలంక జరిగే అంతర్జాతీయ సదస్సుకు పాల్గొంటున్న సందర్భంగా మంగళవారం డాక్టర్ బి. లక్ష్మయ్యను రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎస్. సోమేశ్వరరావు, రాష్ట్ర డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. బాలరాజ్,రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.పర్వతాల గౌడ్. తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ ఇంటర్నేషనల్ థైకాండో కన్వీనర్, ఇంటర్నేషనల్ టైక్వాండో మాజీ ఆటగాడు జె. బాబూలాల్, రాష్ట్ర తెలం-గాణ ఎయిడెడ్ కాలేజ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు తదితరులు ఘనంగా సన్మానించారు.