ఇండియాస్ నెక్ట్స్ డాకర్ హీరో ఆవిష్కరణ
18 ఏళ్ల ఘోర్పడేను తీసుకున్న హీరో మోటోస్పోర్ట్స్
న్యూఢిల్లీ, జూన్ 24 : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మోటార్ స్పోర్ట్ ఈవెంట్‌గా పేరున్న డాకర్ ర్యాలీ కోసం భారత్ నుంచి ప్రాతినిథ్యం పెంచడమే ల క్ష్యంగా హీరో మోటోస్పోర్ట్స్ కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇండియాస్ నెక్స్ డాకర్ హీరో (ఐఎన్‌డిహెచ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో రేసింగ్‌లో సంచల నాలు సృష్టిస్తున్న 18 ఏళ్ల శ్లోక్ ఘోర్పడేను హీరో మోటోస్పోర్ట్స్ టీమ్‌లోకి తీసుకుంది. తమ పదేళ్ల సుధీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవలే వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఇదే వేదికపై మో టోక్రాస్, సూపర్‌క్రాస్ రైడర్ ఘోర్ప డే ఎం ట్రీని ప్రకటించింది. ఈ వార్షికోత్సవ వేడుకల్లో 2024 ఎఫ్‌ఐఎం వరల్డ్ ర్యాలీ రైడ్ ఛాంపియన్ రాస్ బ్రాంచ్, ప్రముఖ రై డ ర్లు నాచో కార్నెజో, మైఖేల్ డోచెర్టీ, మహిళా రైడర్ సౌమ్య మోక్ష చౌదని వంటి వారు పా ల్గొన్నారు.
దశాబ్ద కాలంగా హీరో మోటో స్పోర్ట్స్ టీమ్ ర్యాలీ అద్భుతమైన రేసింగ్ జ ట్టుగా రూపాంతరం చెందడం గర్వంగా ఉం దని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ చెప్పారు. స్వదేశీ రైడర్లను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. కాగా 18 ఏళ్ల శ్లోక్ ఘోర్పడేతో ఒప్పందం తమ కంపెనీకి మరో మైలురాయి కానుందని చెప్పారు. ఘోర్పడే నేషనల్ ఇం డియా సూపర్‌క్రాస్ సర్క్యూట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇండి యా సూపర్ క్రాస్ లీగ్‌లో అత్యంత వేగవంతమైన జాతీ య రేసర్‌గా నిలిచాడు.






