25 June, 2026 | 1:31 AM

విశ్వనాథన్ ఆనంద్‌కు ఎస్‌జెఎఫ్‌ఐ మెడల్

25-06-2026 12:00 AM

చెన్నై, జూన్ 24 : భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జెఎఫ్‌ఐ) పురస్కా రానికి ఎంపికయ్యారు భారత క్రీడారంగం లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఎస్‌జెఎఫ్‌ఐ ఈ పతకాలను అందిస్తోంది. ఈ ఏడాది ఆనంద్ ఎస్‌జెఎఫ్‌ఐ మెడల్ అందుకున్నారు.ఈ కార్యక్రమానికి భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై ఆనంద్‌కు మెడల్ అందజేసి సత్కరించారు.

తంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, విజయ్ అమృత్‌రాజ్, ప్రకాశ్ ప దుకునే, పీటీ ఉష, మిల్కాసింగ్ ఈ పురస్కారం అందుకున్న వారిలో ఉన్నారు. చెస్ లో ఆనంద్ సాధించిన విజయాలు అపూర్వమని కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానిం చారు. కాగా ఎస్‌జెఎఫ్‌ఐ మెడల్ అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని విశ్వనాథన్ ఆనంద్ చెప్పారు. హాకీ ప్లేయర్ వి.భాస్కరన్, వెటరన్ జర్నలిస్ట్ ఆర్. మోహన్, గ్రాండ్ మాస్టర్ శశికిరణ్ ఎస్‌జెఎఫ్‌ఐ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జెఎఫ్‌ఐ ప్రెసిడెంట్ సరాజు చక్రవర్తి, సెక్రటరీ వరికుప్పల రమేష్ పాల్గొన్నారు.